Site icon HashtagU Telugu

Cinema: జ‌గ‌న్ సార్.. అంద‌రికీ వ‌రాలు ఇస్తారు.. మరి మాకు ఇవ్వ‌రా?

Template (57) Copy

Template (57) Copy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల వివాదంపై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా రీట్వీట్ చేశారు. తెలంగాణ‌లో కారు పార్కింగ్ ధ‌రే రూ.30 ఉంద‌ని, ఏపీలో మాత్రం బాల్క‌నీ టికెట్ ధ‌ర రూ.20, ఫ‌స్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధ‌ర రూ.10 ఉందంటూ అందులో ఉంది. ఈ ఫొటోల‌నే బ్ర‌హ్మాజీ పోస్ట్ చేస్తూ.. ‘సీఎం జ‌గ‌న్ స‌ర్.. అంద‌రికీ వ‌రాలు ఇస్తారు పాపం థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు, సినిమా వాళ్ల‌కి కూడా సాయం చేయండి.. ఇట్లు మీ మీ నాన్న గారి అభిమాని’ అంటూ బ్రహ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌కు నెటిజ‌న్లు అదే స్థాయిలో రిప్లైలు ఇస్తున్నారు.