Site icon HashtagU Telugu

Akshay Kumar: ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌ గా అక్షయ్!

Akshay

Akshay

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్ ధామిని మర్యాదపూర్వకంగా కలిశారు. యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని అక్షయ్‌ ప్రశంసించారని పేర్కొంటూ ధామి తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అక్షయ్ కుమార్ గత కొన్ని రోజులుగా ముస్సోరిలో తన తదుపరి సినిమా షూటింగ్ జరుపుకుంటున్నాడు. షూటింగ్ మధ్యలో సీఎం ధామి ఇంటికి వెళ్లి ఈ ఉదయం ఆయనను కలిశారు.

మేము అతనికి (అక్షయ్ కుమార్) ఒక ప్రతిపాదన ఇచ్చాం. అతను దానిని అంగీకరించాడు. ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పని చేస్తాడు” అని సిఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14, 2022న జరుగుతాయి మరియు ఫలితాలు మార్చి 10న ప్రకటించబడతాయి.

 

 

Exit mobile version