Harish Rao: పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి నిర్విరామంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని, ప్రజా క్షేత్రంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండి, అంకితభావంతో మీరు పడిన కష్టం, తపన నాతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.
కాగా సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో 114పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా హరీష్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ.. నేను కుటుంబ సభ్యులతో కలిసి భారత్ నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నానని, తెలంగాణలో ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొన్నారని అన్నారు. గతంలో కంటే ఎక్కువ పట్టణాలలో పోలింగ్ పెరుగుతుందని, ప్రశ్నించే గొంతుక ఉండలని ప్రజలు ఆలోచిస్తున్నారని, ప్రజాస్వామ్యం బలపడలంటే అందురు ఓటింగ్ లో పాల్గొనాలని హరీశ్ రావు అన్నారు.