Site icon HashtagU Telugu

Mega Event: ‘అన్న కోసం తమ్ముడు’.. ఆచార్య ప్రిరిలీజ్ కు పవన్!

Acharya

Acharya

మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుద‌ల చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు.

అయితే మొదట్లో ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్మోరెడ్డిని ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని తేలింది. తాజా సమాచారం ఏంటంటే.. ప్రిరిలీజ్ వేడుకకు జనసేన అధినేత, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర టీం అధికారికంగా ప్రకటించింది. ఇదే కనుక నిజమైతే ఒకే వేదికపై ముగ్గురు మెగా హీరోల సందడి నెలకొనబోతోంది. ఇప్పుడు ఈ వార్త మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. కాగా ఈ ప్రిరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు తెలంగాణ పోలీసులు కూడా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది!

Exit mobile version