Site icon HashtagU Telugu

5 Killed : మేఘాల‌య టీఎంసీ ర్యాలీలో అప‌శృతి.. జీపు బోల్తా ప‌డి ఐదుగురు మృతి

TMC Rally

TMC Rally

మేఘాలయలో టీఎంసీ ర్యాలీలో అప‌శృతి చోటుచేసుకుంది. ర్యాలీలోని ఓ జీపు బోల్తా పడి ఐదుగురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు సోమవారం మేఘాలయలోని నార్త్ గారో హిల్స్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బొల్మెడంగ్‌లో టీఎంసీ ర్యాలీ జరుగుతోంది. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం అస్సాంలోని గోల్‌పరా ఆసుపత్రికి తరలించామని నార్త్ గారో హిల్స్ పోలీస్ చీఫ్ శైలేంద్ర బమానియా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ప్రసంగించే ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు జీపులో ఉన్నవారు అడోగ్రే గ్రామానికి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version