Suriya: హీరో సూర్యకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు, షూటింగ్ నిలిపివేత..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం నటిస్తున్నచిత్రం కంగువా (Kanguva). శివ దర్శకత్వంలో ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపుదిద్దుకుంటోంది.

  • Written By:
  • Updated On - November 23, 2023 / 01:53 PM IST

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం నటిస్తున్నచిత్రం కంగువా (Kanguva). శివ దర్శకత్వంలో ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపుదిద్దుకుంటోంది. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. కంగువా మూవీ సెట్స్ లో సూర్యకు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతుంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.

బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ముఖ్యమైన షార్ట్ ను చిత్రీకరిస్తున్న సమయంలో కెమెరా హ్యాండిల్ సూర్య భుజానికి గాయమైంది. దింతో వెంటనే స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారని సమాచారం. కాస్త నొప్పి ఉండటంతో ఒకరోజు షూటింగ్ ను చిత్రయూనిట్ నిలిపివేసింది. సూర్యకు గాయమైన విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకొని మూవీ షూటింగ్ పాల్గొనాలని కోరుకుంటున్నారు.

Also Read: Dhootha Trailer : నాగ చైతన్య ‘దూత’ ట్రైలర్ టాక్

హీరో సూర్యకు తమిళ్ తో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదల చేస్తుంటారు మేకర్స్. కంగువ సినిమాను 38 భాషల్లో 3డి, ఐమాక్స్ టెక్నాలజీలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ గతంలోనే తెలిపారు. సూర్యకు గాయం కావడంతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.