హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లారీ వెనుక చక్రాల కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు.ఈ ఘటన అబిడ్స్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిబండ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల జై సాయి అనే యువకుడు హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం అనంతరం ఇంటికి తిరిగి వస్తున్నాడు.ఆ సమయంలో ప్రమాదవశాత్తు లారీపై నుంచి పడి చక్రాల కింద పడి చనిపోయడని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
Hyderabad : హైదరాబాద గణేష్ నిమజ్జనంలో విషాదం.. లారీ ఢీకొని..?

Road accident