AP Govt : ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు భద్రతను పెంచిన ఏపీ సర్కార్..

న్యాయమూర్తి హిమబిందు భద్రతను పెంచింది. 4+1 ఎస్కార్ట్ కల్పించింది ప్రభుత్వం

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 08:12 PM IST

ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు (ACB Court Justice Hima Bindu) భద్రత విషయంలో ఏపీ సర్కార్ (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హిమబిందు స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో అరెస్ట్ అయినా మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) కేసును వాదిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు రెండు వారాలపాటు రిమాండ్ విధించింది. కాగా జైల్లో చంద్రబాబు కు ప్రాణ హాని ఉందంటూ…ఆయన్ను హౌస్ రిమాండ్ చేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు మాత్రం చంద్రబాబు తరపు న్యాయవాదులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాక్ టు బ్యాక్ పిటిషన్లు దాఖలు చేసి వెంటనే వాదనలు ప్రారంభించడంపై న్యాయవాదులపై జస్టిస్ హిమబిందు మండిపడ్డారు. నిరంతర పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతోందని, పిటిషన్‌పై ఉత్తర్వులు వెలువడే వరకు వేచి ఉండలేమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

Read Also : KA Paul : చంద్రబాబు అరెస్ట్ ని సమర్ధించిన కేఏ పాల్..

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదన్న సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్ట్ ఏకీభవించింది.ఇలా చంద్రబాబు పిటిషన్లను జడ్జ్ కొట్టివేస్తుండడం తో.. సోషల్‌మీడియాలో హిమబిందు టార్గెట్‌గా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసిన ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి హిమబిందు భద్రతను (acb court judge hima bindu security increased) పెంచింది. 4+1 ఎస్కార్ట్ కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎలాంటి భద్రత లేదు. కోర్టుకు వచ్చి, వెళ్లే సమయంలో నిఘా పెట్టారు పోలీసులు.