Site icon HashtagU Telugu

Crime News: పెళ్లి సాకుతో రెండేళ్లుగా యువతిపై అత్యాచారం

Rape Imresizer

Rape Imresizer

Crime News: పెళ్లి సాకుతో ఓ మెకానిక్ యువకుడు రెండేళ్లుగా బాలికపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేవడంతో పెళ్లికి నిరాకరించారు. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

మంగళూరు కొత్వాలి ప్రాంతంలోని బుక్కన్‌పూర్ గ్రామానికి చెందిన షహరాన్ ఫ్రిజ్ ఏసీ మెకానిక్ గా పని చేస్తుండేవాడు. రెండేళ్ల క్రితం లక్సర్ కొత్వాలి ప్రాంతంలోని యువతి ఇంటి ఎదురుగా ఏసీ, ఫ్రిజ్ రిపేరింగ్ దుకాణం తెరిచాడు. పొరుగునే ఉండడంతో షహరాన్ ఆమెను ప్రేమలో దించాడు. పెళ్లి సాకుతో రెండేళ్లుగా ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతీ అశ్లీల వీడియో తీశాడు. ఈలోగా యువకుడి సమీప బంధువు అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడ్డాడు.

ఈ విషయం యువతికి తెలియడంతో యువకుడిపై తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. యువకుడు పెళ్లికి నిరాకరించాడు. నోరు విప్పితే తన వీడియోను ఇంటర్నెట్ లో వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయమై యువకుడి బంధువులతో మాట్లాడగా ఐదు లక్షల నగదు, కారు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డిమాండ్ అంగీకరించకపోవడంతో ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Read More: Childhood Friends : 18ఏళ్ల త‌రువాత ఇన్‌స్టాగ్రామ్‌లో క‌లిసిన చిన్న‌నాటి స్నేహితులు..