DUSU Election Result 2023: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ప్రభంజనం

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులను ఎబివిపి(ABVP) గెలుచుకోగా, వైస్ ప్రెసిడెంట్ పదవిని ఎన్ ఎస్ యుఐ(NSUI) గెలుచుకుంది.

Published By: HashtagU Telugu Desk
DUSU Election Result 2023

DUSU Election Result 2023

DUSU Election Result 2023: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులను ఎబివిపి(ABVP) గెలుచుకోగా, వైస్ ప్రెసిడెంట్ పదవిని ఎన్ ఎస్ యుఐ(NSUI) గెలుచుకుంది. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ (NSUI) అభ్యర్థి హితేష్ గులియాను ఓడించి బివిపి అభ్యర్థి తుషార్ దేధా DUSU అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఏబీవీపీకి చెందిన అపరాజిత, జాయింట్ సెక్రటరీగా సచిన్ బైస్లా ఎన్నికయ్యారు.కాగా ఉపాధ్యక్షుడిగా NSUI అభ్యర్థి అభి దహియా విజయం సాధించారు. ఎన్నికల్లో నాలుగు స్థానాలకు 24 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సెంట్రల్ ప్యానెల్ కోసం 52 కళాశాలలు మరియు విభాగాలలో ఎన్నికలు ఈవీఎం పద్దతి ద్వారా నిర్వహించారు. కళాశాల యూనియన్ ఎన్నికలకు ఓటింగ్ పేపర్ బ్యాలెట్‌లో జరిగింది. యూనివర్సిటీలో 42 శాతం ఓటింగ్ నమోదైంది. DUSU పోల్స్‌లో సుమారు లక్ష మంది విద్యార్థులు ఓటు వేయడానికి అర్హత సాధించారు.DUSU ఎన్నికలు చివరిగా 2019లో జరిగాయి. ABVP 2019 ఎన్నికల్లోనూ నాలుగు సీట్లలో మూడింటిని కైవసం చేసుకుంది.

Also Read: Muslim man Md Siddhik doing Ganesh Navaratri ముస్లింలు చేస్తున్న గణేష్ నవరాత్రులు.. ఎక్కడో తెలుసా..!

  Last Updated: 23 Sep 2023, 06:23 PM IST