Parijat Tree: రాత్రి సమయంలో స్వర్గాన్ని తలపిస్తున్న భారీ వృక్షం.. ఆ చెట్టు ప్రత్యేకత ఇదే?

మామూలుగా మనం ఎక్కడికైనా అందమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రకృతి అందాలు, అట్మాస్ఫియర్ అన్ని బాగుంటే స్వర్గంలో ఉంది అని

  • Written By:
  • Publish Date - August 24, 2023 / 04:40 PM IST

మామూలుగా మనం ఎక్కడికైనా అందమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రకృతి అందాలు, అట్మాస్ఫియర్ అన్ని బాగుంటే స్వర్గంలో ఉంది అని అంటూ ఉంటాం. స్వర్గం ఎలా ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు కానీ మనం కథల రూపంలో చాలాసార్లు వినే ఉంటాం. స్వర్గంలో ప్రతి ఒక్కటి కూడా అందంగా ఎంతో మనోహరంగా ఉంటాయని వింటూ ఉంటాం. అయితే స్వర్గపు వృక్షాన్ని ఎప్పుడైనా చూశారా. స్వర్గపు వృక్షం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ఈ దివ్య వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఉంది. ఈ వృక్షానికి ప్రతిరాత్రి రంగురంగుల పూలు వికసిస్తాయి.

అవి ఉదయానికి రాలిపోతాయి. ఈ దివ్య వృక్షాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తుంటారు. పౌరాణిక గాథల ప్రకారం సాగరాన్ని మథించినప్పుడు అమృతంతో పాటు పారిజాత వృక్షం కూడా వెలికి వచ్చిందని చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ పారిజాతాన్ని తన తన భార్య సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడని చెబుతారు. అర్జునుడు మహాభారత కాలంలో ద్వారకా నగరంలోని ఈ వృక్షాన్ని కింతూర్‌ గ్రామానికి తీసుకువచ్చాడని స్థానికులు చెబుతుంటారు. ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో గల కింతూర్‌ గ్రామంలో ఉంది. ఈ పారిజాత వృక్షానికి స్థిరమైన పేరు లేదు. దీనిని హర్సింగర్, షెఫాలీ, ప్రజక్త అనేక ఇతర పేర్లతో పిలుస్తారు.

పారిజాతంనకు బెంగాల్ రాష్ట్ర పుష్పం హోదా కూడా ఉంది. ఈ భారీ పారిజాత వృక్షం ఈ గ్రామంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రతి రాత్రి ఈ చెట్టుకు చాలా అందమైన పూలు వికసిస్తాయి. ఉదయం కాగానే ఈ పూలన్నీ నేలరాలిపోతాయి. యూపీలోని బారాబంకి జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింతూర్ గ్రామం మహాభారత కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. పాండవుల తల్లి అయిన కుంతి పేరు మీదుగా ఈ గ్రామం ఏర్పడిందంటారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు ఈ గ్రామంలోనే ఉన్నారట. కుంతీమాత ప్రతిరోజూ శివునికి పూలు సమర్పించవలసి వచ్చినప్పుడు, అర్జునుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి ఇక్కడకు తీసుకువచ్చారని చెబుతారు.

గ్రామంలో కుంతీమాత నెలకొల్పిన కుంతేశ్వరాలయం కూడా ఉంది. అలాగే ఇతర పూలతో పోలిస్తే పారిజాతం పూలు ప్రత్యేక సమయంలో మాత్రమే వికసిస్తాయి. దీని వెనుక ఇంద్రుని శాప వృత్తాంతం కూడా దాగి ఉంది. ప్రపంచం మొత్తంలో పూలు ఉదయం పూస్తుండగా, పారిజాతం పూలు రాత్రి పూట వికసించి, చూపరులకు అందాలను అందిస్తాయి. సత్యభామ ఈ పూలతో తన కురులకు అలంకరించుకునేదని, రుక్మణి ఈ పూలను పూజకు ఉపయోగించేదని చెబుతుంటారు. ఆ చెట్టు పగల సమయం కంటే రాత్రి సమయంలో ఎంతో అందంగా ఉంటుందట. రంగు రంగుల పూలతో స్వర్గాన్ని తలపిస్తుందని స్థానికులు చెబుతూ ఉంటారు.