Patna Opposition Meet: ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విపక్షాలు దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో రేపు పాట్నాలో విపక్షాలు సమావేశం కానున్నాయి. అయితే శుక్రవారం పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి ఉత్తరప్రదేశ్ నుండి సమాజ్ వాదీ పార్టీ మాత్రమే హాజరవుతుంది. మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ఆహ్వానించలేదని తెలుస్తుంది. కాగా… రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరి కుటుంబ కార్యక్రమం కారణంగా సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆమె.
విపక్షాల సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ ముందు ఆప్ తమ డిమాండ్ వినిపించింది. ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తామని హామీ ఇవ్వకపోతే సమావేశం నుంచి వాకౌట్ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More: Patna Opposition Meet: లాలూతో మమతా.. రేపు పాట్నాలో విపక్షాల మీటింగ్ పై చర్చ