Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు వాడీవేడిగా సాగుతున్నాయి. సమావేశంలో మణిపూర్ హింసాకాండపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉభయ సభల్లో మణిపూర్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్‌లో నిరసనకు దిగాయి. ప్రధాని మోదీ మణిపూర్ అల్లర్లపై స్పందించాలంటూ విపక్షాలు పట్టుబట్టగా, ప్రభుత్వం ఈ అంశంపై చర్చకు సిద్ధమని తెలిపింది. మరోవైపు రాజ్యసభలో విపక్షాల గందరగోళం మధ్య, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను వర్షాకాల సమావేశమంతా సస్పెండ్ చేశారు. మణిపూర్ సమస్యపై సభలో విపక్షాల నిరసనల మధ్య ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెండ్ కు గురయ్యారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విరుచుకుపడ్డారు. ఇక మణిపూర్ అంశంపై విపక్షాల నిరంతర ఆందోళన కారణంగా స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.
Also Read: Indigo Video: యుద్ధ వీరుడికి ఇండిగో అపూర్వ స్వాగతం, తోటి ప్రయాణికులు చప్పట్లు