AP 10th Exams: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల..!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి విద్యాశాఖ తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ‌డంతో, పదో తరగతి పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు. వాస్త‌వానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే రెండో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో […]

Published By: HashtagU Telugu Desk
Ap 10th Exams

Ap 10th Exams

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి విద్యాశాఖ తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ‌డంతో, పదో తరగతి పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు.

వాస్త‌వానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే రెండో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఇంటర్‌ పరీక్షలు జ‌రుగ‌నున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన ఏపీ విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈక్ర‌మంలో విద్యార్థులు కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు ప్రిపేర్ కావాలని విద్యాశాఖ‌ కోరింది.

# ప‌దో త‌ర‌గ‌తి పరీక్షల షెడ్యూల్‌

ఏప్రిల్ 27- తెలుగు

ఏప్రిల్ 28- సెకండ్‌ లాంగ్వేజ్‌

ఏప్రిల్ 29- ఇంగ్లీష్‌

మే 2- గణితం

మే 4- సైన్స్‌ పేపర్‌-1

మే 5- సైన్స్‌ పేపర్‌-2

మే 6- సాంఘిక శాస్త్రం

  Last Updated: 19 Mar 2022, 10:26 AM IST