Site icon HashtagU Telugu

Punjab Election Polls: పంజాబ్‌లో టెన్ష‌న్.. కాంగ్రెస్, అప్‌ల మ‌ధ్య‌ ట‌ఫ్ పైట్..!

Punjab Election Polls

Punjab Election Polls

ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల కౌంటింగ్ ఈరోజు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పంజాబ్ ఎన్నిక‌ల కౌంటింగ్ దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. అక్క‌డ గ‌తంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డుస్తోంది. నిముష నిముషానికి రెండు పార్టీల మ‌ధ్య ఆధిక్యం మారుతుంది.

అయితే ప్ర‌స్తుతం అక్క‌డ ఆమ్ ఆద్మీ పార్టీ 53 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌గా, కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో అధిక్యంలో కొన‌సాగుతోంది. శిరోమణి అకాలీదళ్ 21 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన సంగ‌తి తెలిపిందే. ఈ క్ర‌మంలో పంజాబ్‌లో ప్ర‌స్తుతం ఆప్ ఆధిక్యంలోనే ఉన్నా, కాంగ్రెస్ పుంజుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో పంజాబ్ రిజ‌ల్ట్స్ టెన్ష‌న్ పెడుతున్నాయి. ఇక‌పోతే పటియాలలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వెనుకంజలో ఉండ‌డం విశేషం.