Site icon HashtagU Telugu

Punjab Election Polls:: పంజాబ్‌ను ఊడ్చేస్తున్న‌ ఆప్

Assemblyelectionresult2022

Assemblyelectionresult2022

ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటిగ్ షురూ అయ్యింది. ఈ క్ర‌మంలో పంజాబ్ ఎన్నిక‌ల్లో అనూహ్య ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. అక్క‌డ గ‌తంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీల మ‌ధ్య గ‌ట్టి పోటీ సాగినా, కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దేటేసింది. పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలు ఉండ‌గా, అధికారం చేప‌ట్టాలంటే మ్యాజిక్ ఫిగ‌ర్ 59 స్థానాలు దాటాల్సి ఉంద‌ది.

అయితే పంజాబ్‌లో మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసిన ఆమ్ ఆద్మీ పార్టీ, ప్ర‌స్తుతం 74 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధిక్యంలో కొన‌సాగుతోంది. ఇక మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో అధిక్యంలో కొన‌సాగుతూ రెండో స్థానంలో ఉంది. దీంతో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 100 స్థానాలు దాటే అవ‌కాశం ఉందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌పోతే పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉండ‌గా, పీసీసీ చీఫ్ సిద్ధూ కూడా వెనుకంజ‌లో ఉన్నారు. అలాగే శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ వెనుకంజలో ఉన్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌ను ఊడ్చేయ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.