Site icon HashtagU Telugu

Aajtak : ప్రధాని మోడీ చనిపోయారంటూ నోరు జారిన యాంకర్

Aaj Tak Anchor

Aaj Tak Anchor

అప్పుడప్పుడు రాజకీయ నేతలు, పలు రంగాల ప్రముఖులే కాదు టీవీ యాంకర్లు (TV Anchors ) సైతం నోరు జారుతుంటారు. తాజాగా ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ ఆజ్‌తక్‌ యాంకర్‌ (Aajtak Anchor ) సైతం అలాగే నోరు జారింది. గురువారం రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan singh) మరణ వార్తను ప్రకటించే సమయంలో, ఆ యాంకర్‌ ప్రధాని నరేంద్ర మోదీ (Pradhan Mantri Narendra Modi) చనిపోయారని పొరపాటుగా అన్నారు.

ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆమె తప్పు తెలుసుకొని, తన వ్యాఖ్యలను సరిదిద్దుతూ మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూశారని చెప్పినప్పటికీ, ఈ పొరపాటు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.ఇది తొలిసారి కాదు. ఈ యాంకర్ గతంలో రూ.2 వేల నోట్లలో చిప్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలు ఎదుర్కొన్నాయి. మీడియా ప్రతినిధులుగా, ముఖ్యంగా లైవ్‌ టెలికాస్ట్‌ చేసే వారికి మరింత జాగ్రత్త అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. టీవీ యాంకర్ల బాధ్యతాహీనత ప్రజలను తప్పుడు సమాచారం నమ్మేలా చేస్తుందని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా దేశ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనాగరికత అని కొందరు అభిప్రాయపడ్డారు.

Read Also : Manmohan Singh : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మై భాయ్ మన్మోహన్ – మలేషియా ప్రధాని ట్వీట్