Aadhar Card: ఆధార్ కార్డులో ఈ అప్డేట్ చేయలేదా.. అయితే మీరు సమస్యల్లో చిక్కుకున్నట్టే?

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు కీలకంగా మారింది. అంతేకాకుండా ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా ఒకటిగా

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 05:35 PM IST

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు కీలకంగా మారింది. అంతేకాకుండా ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా ఒకటిగా మారిపోయింది. అటువంటి ఆధార్ కార్డులను ఏ చిన్న తప్పు ఉన్న దానిని సరి చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఎప్పుడైనా మీ మొబైల్ నెంబరు మారితే దానిని ఆధార్ తో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాత నెంబర్ ప్లేస్ లో కొత్త నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కి మొబైల్ నెంబర్ కు లింక్ అయితేనే మనం బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించిన పనులను
కేవైసీ ని పూర్తి చేసుకోవచ్చు.

ఒకవేళ మీ ఫోన్ నెంబర్ మారితే ఆధార్ కార్డులో అప్డేట్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ను అప్డేట్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్లి మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కాగా మొదట UIDAI వెబ్‌సైట్‌లో గానీ, సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ లోగానీ అపాయింట్‌మెంట్ తీసుకొని మీకు అపాయింట్మెంట్ దొరికిన రోజు ఆధార్ ను ఎన్ రోల్ మెంట్ సెంటర్లో అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ ను కలసి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫాంను పూర్తి చేసి ఆ ఎగ్జిక్యూటివ్‌ కు సమర్పించాలి.

ఆ తరువాత వారు మీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ ఎగ్జిక్యూటివ్ మీ డీటెయిల్స్‌ను సరి చూస్తారు. అనంతరం ఆ ఎగ్జిక్యూటివ్ మీ ఫోన్ నంబర్ వివరాలను మారుస్తారు. అయితే ఆధార్ అప్‌డేట్ సేవలు పొందినందుకు మీరు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మీరు సంబంధిత అధికారి నుంచి అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ పొందగా అందులో స్లిప్‌లో ఒక అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ ఉంటుంది. దంతో మీరు ఆధార్ కార్డు రిక్వెస్ట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. అయితే మీ ఆధార్ కార్డ్ లో మొబైల్ నెంబర్ అప్డేట్ అయిన వెంటనే మీరు మరొక కొత్త ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.