Site icon HashtagU Telugu

Aadhaar Card: మొబైల్ లోనే మీ ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

Aadhaar Updation

Aadhaar Updation

సాధారణంగా ఆధార్ కార్డులో కొన్ని సార్లు అనుకోకుండా సమాచారం తప్పుగా పడుతూ ఉంటుంది. దీంతో ఆధార్ కార్డులో ఆ తప్పులను సరి చేసుకోవడానికి ఆధార్ సెంటర్ ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఆధార అప్డేట్లు తొందరగా పూర్తి అయితే మరికొన్ని ఆధార అప్డేట్ల కోసం రోజుల తరబడి ఆధార్ సెంటర్లో చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటే ప్రతి చిన్న దానికి ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన పని లేదట. ఆధార్లో కొన్ని రకాల అప్డేట్లను స్వయంగా మొబైల్ ద్వారానే అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మన ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ హోల్డర్లకు ఈ అవకాశాన్ని యూనిట్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కల్పించింది. అయితే కేవలం నాలుగు రకాల వివరాలను మాత్రమే ఆన్లైన్లో అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, జెండర్ ఈ నాలుగింటిని ఆధార్ కార్డులో ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. నాలుగింటిని అప్డేట్ చేసుకోవడం కోసం ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో మీ ఆధార్ వివరాలు అప్‍‌డేట్ చేయడానికి https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. Online Update Services పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి. Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.

పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఎంఆధార్ యాప్‌లో అప్‍‌డేట్ చేయడానికి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎంఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి. మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. లాగిన్ చేసిన తర్వాత Aadhaar Update పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.  పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో ఉంటాయి. మీరు మార్చాలనుకుంటున్న వివరాలకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మార్చాలనుకున్న వివరాలు ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.