Site icon HashtagU Telugu

Aadhaar: ఇకపై ‘ఆధార్’ ఆడ్రస్ ఈజీగా మార్చుకోవచ్చు

aadhar card

aadhar card

ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వినియోగదారుల ఇబ్బందులను ద్రుష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆధార్‌ కార్డులో చిరునామా మార్చుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మరో వెసులుబాటును తీసుకొచ్చింది. ఆధార్‌లో భార్య, పిల్లల చిరునామా మార్చాలంటే ఇదివరకు వారి పేరున ఉండే గుర్తింపు కార్డును చూపించాల్సి వచ్చేది. అలా కాకుండా కుటుంబ పెద్ద స్వీయ ధ్రువీకరణ -సెల్ఫ్‌డిక్లరేషన్‌ పత్రంతో పిల్లలు, జీవితభాగస్వామి చిరునామాను మార్చే కొత్త విధానాన్ని ఇప్పుడు తీసుకొచ్చినట్లు యూఐడీఏఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version