Site icon HashtagU Telugu

Zaheerabad Crime: జహీరాబాద్‌లో దారుణం.. వివాహిత‌పై గ్యాంగ్ రేప్‌..!

Crime

Crime

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ శివారులోని డిడిగి అనే గ్రామంలోని వివాహితపై సామూహిక అత్యాచార జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 24ఏళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు కూక‌ట్‌ప‌ల్లి నుంచి ఆటోలో తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహిత సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతానికి చెందినట్లు గుర్తించారు.

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ నుంచి వివాహితను తీసుకొచ్చి జహీరాబాద్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యాచారం చేసిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం ఉదయం అచేతన స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానిక వ్యక్తి గుర్తించి జహీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించాడు. సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై మాట్లాడేందుకు జహీరాబాద్ డీఎస్పీ రఘు నిరాకరించారు. అయితే పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.