Site icon HashtagU Telugu

Medchal: మేడ్చల్ లో విషాదం, గాలిపటం ఎగురవేస్తూ యువకుడు మృతి

kite manja

kite manja

Medchal: హైదరాబాద్ శివారులోని మేడ్చల్ లో దారుణం జరిగింది. గాలిపటం ఎగురవేస్తూ యువకుడు చనిపోయాడు. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న రాజ శేఖర్  కుమారుడు. గాలిపటం ఎగురవేస్తూ , ప్రమాదవ శాత్తు భవనం పైనుండి పడిచనిపోయాడు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో కుటుంబం శోక సముద్రం లో మునిగిపోయింది. సహచర ఉద్యోగి ఇంట్లో కుమారుడు మృతి చెందడం తో అల్వాల్ పోలీసు స్టేషన్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

అటు లంగర్‌హౌజ్‌లో చైనా మాంజా మెడకు చుట్టుకుని సైనికుడు మృతిచెందాడు. లంగర్ హౌస్ పైవంతెన వద్ద సైనికుడి మెడకు మాంజా చుట్టుకుంది. విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సైన్యంలో పనిచేస్తున్న జవాన్ విశాఖకు కోటేశ్వరరావుగా గుర్తించారు. గాలిపటాలు ఎగరేస్తూ రెండ్రోజుల్లో పలువురు మృతి చెందారు.

Also Read: Harish Rao: క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా గా ‘సిద్దిపేట‘

Exit mobile version