Viral: డాక్టరు లేకుండా సముద్రంలోకి దిగి ప్రసవించిన మహిళ.. వైరల్ వీడియో

పసిఫిక్ మహాసముద్రంలోకి దిగి ఆ నీటిలోనే ఓ నిండు గర్భిణి ఎలాంటి డాక్టర్ సహాయం లేకుండా సహజ పద్ధతిలో ప్రసవించిన వీడియో

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 06:00 PM IST

పసిఫిక్ మహాసముద్రంలోకి దిగి ఆ నీటిలోనే ఓ నిండు గర్భిణి ఎలాంటి డాక్టర్ సహాయం లేకుండా సహజ పద్ధతిలో ప్రసవించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. జోసీ ప్యూకెర్ట్ (37) నికరాగ్వాలోని ప్లేయా మజాగువల్ సముద్ర తీరంలో డెలివరీ వీడియోను పోస్ట్ చేసింది. గర్భధారణ సమయంలో స్కాన్‌లను సైతం తిరస్కరించిన ఆమె, ఎలాంటి వైద్య సహాయం లేకుండానే తన బిడ్డకు సముద్రంలోకి దిగి ఆ నీటిలోనే జన్మనిచ్చింది. జోసీ డైలీ మెయిల్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది. “నేను సహజ పద్ధతిలో సముద్రంలో ప్రసవించాలనుకున్నాను. ఆ రోజు పరిస్థితులు బాగానే ఉన్నందున నేను అలా చేశాను” అని పేర్కొంది. గత వారం రోజులుగా సముద్రంలో ఆటుపోట్లను చూశాను. అయితే నాకు ప్రసవించే సమయం వచ్చినప్పుడు బీచ్ సురక్షితంగా ఉందని అనిపించిందని జోసీ పేర్కొంది.

తాను ప్రసవ వేదనలో ఉన్నాను అనే సంగతి జోసీకి తెలియగానే, ఆమె తన భాగస్వామితో కలిసి, ఓ ఫస్ట్ ఎయిడ్ టూల్ కిట్‌తో బీచ్‌ కు వెళ్లింది. ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్సులో తువ్వాలు, బొడ్డు తాడుతో సహా బిడ్డను పట్టుకోవడానికి స్ట్రైనర్‌తో కూడిన గిన్నె, గేజ్ క్లాత్, పేపర్ నాప్కిన్స్, బొడ్డు తాడును కొసేందుకు ఓ చిన్న సర్చికల్ నైఫ్ ఉన్నాయి. అలల తాకిడిలో ఒక లయ ఉంటుందని, కాబట్టి నాకు నిజంగా ఒక మంచి అనుభూతిని కలిగించిందని జోసీ తెలిపింది. ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియోలో జోసీ తన ప్రసవం సమయంలో బీచ్‌లో మోకరిల్లినట్లు కనిపించింది. మరొక వీడియో క్లిప్ లో తన నవజాత మగ శిశువును పట్టుకున్నట్లు చూపిస్తుంది. శిశువు బొడ్డు తాడు కూడా అందులో కనిపించింది.

శిశువు పుట్టిన తర్వాత టవల్‌లో చుట్టేసి నా భాగస్వామికి శిశువును అప్పగించాను. ఆ తర్వాత నేను రిఫ్రెష్ కావడానికి తిరిగి సముద్రంలోకి వెళ్లాను అని జోసీ చెప్పింది. తర్వాత నేను నొప్పి తగ్గిన తర్వాత, బట్టలు వేసుకుని, అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్ళాము. అదేరోజు సాయంత్రం బేబీ బరువు చూశాము. బేబీ 3.5kgలతో పుట్టింది. ఎలాంటి వైద్య సహాయం లేకుండానే తన బిడ్డ ఎందుకు పుట్టాలని కోరుకుందో జోసీ వివరించింది. తన మొదటి డెలివరీ క్లినిక్‌లో జరిగిందని, అది చాలా బాధాకరంగా అనిపించినట్లు పేర్కొంది. నా రెండవ డెలివరీ ఇంట్లో జరిగింది, కానీ మూడవ డెలివరీ మాత్రం ఎలాంటి డాక్టర్ లేదా స్కాన్ సహాయం లేకుండా సహ పద్ధతిలో కన్నట్లు తెలిపింది.

శిశువు రాక కోసం మేము ఎలాంటి గడువు తేదీని చూసుకోలేదు. తమ బిడ్డ తన దారిని వెతుక్కుంటూ ఈ లోకంలోకి వస్తాడని మేము నమ్ముతున్నాము, ఆమె చెప్పింది. నా జీవితంలోకి మరో కొత్త జీవితాన్ని స్వాగతించడానికి నాకు ఎలాంటి భయం లేదా ఆందోళన లేదు. నేను, నా భాగస్వామి, సముద్రపు అలలు మాత్రమే ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ఈ ప్రసూతి పద్ధతిని పలువురు ప్రశంసించగా, మరికొందరు విమర్శించారు. సముద్రంలో చాలా బ్యాక్టీరియా ఉంటుందని, అలాగే గర్భంలో వేడిగా ఉన్న శిశువు ఒక్క సారిగా చల్లని సముద్రపు నీటిలోకి రావడం ప్రమాదం అని, అలా చేయడం వల్ల బిడ్డకు షాక్ తగిలినట్లు ఉంటుందని మరో యూజర్ కామెంట్ చేశాడు. దీనికి ఆ మహిళ సమాధానం ఇస్తూ, తమ బిడ్డ మధ్యాహ్న ఎండలో దాదాపు 35 డిగ్రీలు ఉన్నప్పుడు పుట్టాడని, నీటి ఇన్ఫెక్షన్ల గురించి నేను చింతించలేదు. అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. నేను అతనికి సురక్షితంగా ఉండేలా సహజ పద్ధతిలో అన్ని ఏర్పాట్లు చేసాను అని పేర్కొంది.