Hyderabad: మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన మహిళను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ కృష్ణానగర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పి.లక్ష్మి(30) కొన్నేళ్ల క్రితం యూసుఫ్ గూడలో ఫుట్ పాత్ పై ఓ బాలికను గుర్తించి ఆశ్రయం కల్పించింది. రెండేళ్లుగా మైనర్ బాలికను లక్ష్మి బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు. అందుకు బాలిక నిరాకరించడంతో ఆమె జుట్టును పట్టుకొని ఈడ్చీ..ఇనుప రాడ్డుతో కొట్టడంతో గాయాలయ్యాయి’ అని పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారంతో పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి మహిళను రక్షించారు. ఈ రోజు తమ పరిసరాల్లో ఏవైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఉంటే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. కాగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. పబ్బుల్లో, క్లబుల్లో రహస్యంగా జరుగుతున్నప్పటికీ, మరికొన్ని బస్తీల్లో యథేశ్చగా జరుగుతోంది. అమాయక యువతులను రొంపిలోకి దింపి డబ్బులు సంపాదిస్తున్నారు దళారులు.