గుజరాత్‌లో ఈదురు గాలులకు బైక్‌పై చెట్టు కూలడంతో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె భర్తకు గాయాలైయ్యాయి. బలమైన గాలుల కారణంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా జస్దాన్ తాలూకాలో రాష్ట్ర రహదారిపై ఈ ఘటన జరిగింది. బిపర్‌జోయ్ తుఫాను కారణంగా గుజరాత్‌లోని చాలా ప్రాంతాలు బలమైన గాలులను వీస్తున్నాయి. జూన్ 15న కచ్ జిల్లాలో గంటకు 150 కిలోమీటర్ల (కిమీ) వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కమ్లాపూర్-భడ్లా రాష్ట్ర రహదారిపై బలమైన గాలుల కారణంగా చెట్టు వారిపై పడటంతో వర్షా బవలియా అనే మహిళ మృతి చెందిందని అధికారులు తెలిపారు. సమీప ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే వర్ష మృతి చెందిందని వెల్లడించారు.
1 Killed : గుజరాత్‌లో విషాదం.. బైక్‌పై చెట్టుకూలి మహిళ మృతి

Death Representative Pti