JP Nadda@Warangal: వరంగల్ లో నడ్డాకు ఘన స్వాగతం

BJP జాతీయ అధ్యక్షుడు ఇవాళ తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Nadda

Nadda

BJP జాతీయ అధ్యక్షుడు ఇవాళ తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటికే నడ్డా వరంగల్‌ చేరుకున్నారు. మధ్యాహ్నం 3.20నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌ చేరుకున్నాడు. JP నడ్డా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు నడ్డాకు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు.

అమ్మవారి పూజలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు… ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించారు. అనంతరం ఆలయ పండితులు నడ్డాను ఆశీర్వదించారు. ఆ తర్వాత  ప్రొఫెసర్‌ వెంకటనారాయణ ఇంటికి వెళ్లి పలుకరించారు. నడ్డా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, అర్వింద్ లు ఉన్నారు. ఇప్పటికే వరంగల్ భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. నడ్డా రాక సందర్భంగా వరంగల్ లో ఎటుచూసినా బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

  Last Updated: 27 Aug 2022, 05:55 PM IST