Viral Video: పిల్లులను కొట్టి తమాషా చూస్తున్న కాకి.. భలే ఉందే!?

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా జంతువులకు

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 05:09 PM IST

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. కాగా అందులో కొన్ని వీడియోలు నవ్వులు తెప్పించేవి కాగా మరికొన్ని మాత్రం బాధ కలిగించే విధంగా ఉంటాయి. ఎక్కువ శాతం కామెడీగా ఉండే వీడియోలు అవుతూ ఉంటాయి. పిల్లి, కుక్క లాంటి జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఫన్నీగా ఉంటాయి. కాగా సాధారణంగా రెండు పిల్లులు కొట్లాడుకుంటే ఎంతో ఫన్నీగా ఉంటూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అవి రక్తాలు వచ్చే విధంగా కూడా పోట్లాడుకుంటూ ఉంటాయి.

కానీ ఎక్కువగా పిల్లలు వాటంతటా అవే పోట్లాడుకుంటూ ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఒక కాకి రెండు పిల్లలకు చిచ్చు పెట్టి తమాషా చూస్తోంది. అవి పోట్లాడుకుంటుంటే దాన్ని చూసి ఎంతో సంతోషపడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆ వీడియోలు రెండు పిల్లులు ఒకచోట ఒకదానికొకటి ఎదురుగా కూర్చుని ఉండగా ఇంతలోనే ఒక కాకి అక్కడికి వచ్చి దానికి దగ్గరగా వెళ్లి ఒక పిల్లి వెనకాల వైపు పొడుస్తుంది. ఆ పిల్లి ఏమీ అనకపోవడంతో మళ్లీ రెండోసారి పోడవగా వెంటనే ఆ పిల్లి మరొక పిల్లి పై దాడి చేస్తూ దాని మీదకు పోట్లాటకు వెళ్ళింది.

 

అవి రెండు పిల్లులు కొట్టుకుంటుండడం చూసిన కాకి సంతోషపడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఆ రెండు పిల్లలు కోట్లాడి సైలెంట్ గా కూర్చోవడంతో వెంటనే ఆ కాకి మళ్లీ వెళ్ళి ఆ పిల్లిని పొడవడంతో ఆ పిల్లి మరో పిల్లి పైకి కొట్లాటకు వెళ్తుంది. ఆ కాకి ఎంచక్కా ఆ పిల్లులను రెచ్చగొడుతూ అవి కొట్టుకుంటుండగా చూసి తమాషా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అలా ఆ కాకి ఆ పిల్లుల గొడవలను రెట్టింపు చేస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది.