Viral Video: స్మార్ట్ ఫోన్ పై మనసు పారేసుకున్న కోతి పిల్ల.. వీడియో వైరల్..?

సాధారణంగా మనం ఎక్కడికైనా టూర్లకి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా జూ లను సందర్శించినప్పుడు అక్కడ రకరకాల

  • Written By:
  • Updated On - August 12, 2022 / 10:18 AM IST

సాధారణంగా మనం ఎక్కడికైనా టూర్లకి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా జూ లను సందర్శించినప్పుడు అక్కడ రకరకాల పక్షులు జంతువులు ఉంటాయి. అలా మనుషుల దగ్గరగా వెళ్ళినప్పుడు కొన్ని రకాల జంతువులు పక్షులు దూరంగా వెళ్లిపోతాయి. కానీ కోతి ఇలాంటి జంతువులు అయితే మనుషులకు మరింత దగ్గరగా వచ్చి మనుషులు ఏమైనా తినడానికి పెడతారా అన్న విధంగా చూస్తూ ఉంటాయి. ఇటువంటి అప్పుడు అటువంటి ఫన్నీ సన్నివేశాలను చాలామంది ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఆ ఫోన్లను కొన్ని కొన్ని సార్లు ఆ కోతులు లాకెళ్తూ ఉంటాయి. ఆ ఫోన్ ని తీసుకెళ్లి వాటిని కొరకడం, అద్దం లాగా చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి.

ఇలాంటి క్రమంలోనే ఆ ఫోన్ ని తిరిగి తీసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని రకాల కోతులు వాటికి ఏదైనా తిండి పెట్టగానే వాటి చేతిలో ఉన్న వస్తువుని విసిరేసి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే తాజాగా కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక కోతి పిల్ల ఒక స్మార్ట్ ఫోన్ పై మనసును పారేసుకుంది. స్మార్ట్ ఫోన్ కోసం ఆ కోతి పిల్ల ప్రయత్నిస్తుండగా దాని తల్లి మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. పూర్తి వివరాలు లోకి వెళితే.. ఒకచోట ఒక తల్లి కోతి పిల్ల కోతి రెండు కూర్చుని ఉంటాయి. ఇంతలో అక్కడికి వెళ్లిన ఒక యువకుడు కోతికి ఆహారాన్ని అందిస్తూ మరొకవైపు ఆ దృశ్యాన్ని వీడియో తీస్తూ ఉంటాడు.

 

అయితే ఆ తల్లి కోతి ఆ యువకుడి చేతిలో ఉన్న ఆహారాన్ని తీసుకొని తింటూ ఉండగా, పిల్ల కోతి మాత్రం తినడం కోసం కాకుండా ఆ యువకుడు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వైపు చూస్తోంది. స్మార్ట్ ఫోన్ ని ఆ యువకుడు దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ యువకుడు ఆ పోన్ ని గట్టిగా పట్టుకోవడంతో అది ఎంత లాగినా సాధ్యం కాలేదు. మరొకవైపు తల్లి కోతి సైలెంట్ గా ఉండు అన్న విధంగా పిల్ల కోతి దూరంగా వెళ్లిన ప్రతిసారి తోక పట్టుకొని మరి లాగుతుంది. కానీ ఆ పిల్ల కోతి మాత్రం మళ్లీ మళ్లీ ఆ స్మార్ట్ ఫోన్ కోసం వెళుతూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా ఆ పిల్ల కోతి ప్రస్తుతం నెట్టిజెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో పై స్పందించిన పలువురు నెటిజన్స్ ఫన్నీగా ఉంది అని కామెంట్ చేయడంతో రకరకాల కామెంట్లు పెడుతున్నారు.