3-year-old boy: షాకింగ్.. పాము పిల్లను నమిలి చంపేసిన మూడేళ్ల బాలుడు!

మూడేళ్ల బాలుడు ఓ పాము పిల్లను నిమిలి చంపేశాడు.

Published By: HashtagU Telugu Desk
Snake

Snake

మూడేళ్ల బాలుడు ఓ పాము పిల్లను నిమిలి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో జరిగింది. అక్షయ్ అనే చిన్నారి తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో పొదల్లోంచి చిన్న పాము బయటకు వచ్చింది. పాకుతూ బాలుడి దగ్గరకు వెళ్లింది. దీంతో పామును చేత్తో పట్టుకొని నోట్లో పెట్టుకుని నమిలి కొరికాడు బాలుడు. ఆ తర్వాత అరవడం మొదలుపెట్టాడు.

అక్షయ్ నోట్లో పాము ఇరుక్కుపోయి ఉండటాన్ని చూసిన బాలుడి అమ్మమ్మ బిత్తరపోయింది. వెంటనే నోటి నుంచి పామును బయటకు తీశారు. భయాందోళనకు గురైన మహిళ, ఆమె బంధువులు అతన్ని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి, క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వైద్యులు చిన్నారిని ఇంటికి పంపించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు. దేవుడా… వీడు మాములోడు కాదు… అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Srisailam: శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు, ఒక్కరోజే 50 వేల మంది దర్శనం

  Last Updated: 05 Jun 2023, 04:25 PM IST