Site icon HashtagU Telugu

Mexico: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం.. 33 మందికి గాయాలు

18 Dead In Mexico Tourist Bus Crash 1682892575317

18 Dead In Mexico Tourist Bus Crash 1682892575317

Mexico: ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తరచూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ప్రమాదాలతో రోడ్లన్నీ రక్తసిక్తంగా మారుతున్నాయి. తాజాగా ఓ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

పశ్చిమ మెక్సికోలోని నయారిట్ రాష్ట్రంలోని కంపోస్టెలాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో 33 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి అధికారులు చేర్చారు. ప్రస్తతుం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బస్సు గుయాబిటోస్ కు వెళ్తుండగా ప్యూర్టో వల్లర్టాను కలిపే హైవే పైనుండి బస్సు లోయలో పడిపోయింది. 49.21 అడుగులు లోతులో ఉన్న లోయలో బస్సు పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇది పర్యాటకుల బస్సు అని అధికారులు చెబుతున్నారు. గుయాబిటోస్ నుంచి ఉత్తమ నగరమైన ప్యూర్టో వల్లర్టాకు తిరిగి వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘోర ప్రమాదంతో తీవ్ర విషాదం నెలకొంది. అద్దె బస్సుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని అంటున్నారు. చెడు వాతావరణం, రహదారి పరిస్థితులు, అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మెక్సికోలో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అతివేగం వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తరచుగా హైవేపై ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.