Accident: సూర్యాపేట జిల్లాలో ఘోరం జరిగింది. లిఫ్ట్ కూలి కిందపడటంతో కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ లో 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారుగ గుర్తించారు పోలీసులు.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ప్రమాదంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తున్నది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: CM KCR: బీసీ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. 10వేల మందికి ఉచితంగా ఫీజు!