Site icon HashtagU Telugu

JammuKashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన.. 80 మందికి గాయాలు

File7prr32ktuhyyjyqh9ju 1 1209701 1681476474

File7prr32ktuhyyjyqh9ju 1 1209701 1681476474

JammuKashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాదచారుల వంతెన కూలిపోవడంతో 80 మంది గాయపడ్డారు. ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్‌లోని చెనాని బ్లాక్‌లోని బైన్ గ్రామంలో బేని సంగమ్‌లో బైసాఖి వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో భక్తులు గాయపడ్డారు. అధికారులు వెంటనే సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అధికారులు సహాయకచర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే భక్తులందరూ ఒక్కసారిగా వంతెనపైకి రావడంతో లోడ్ ఎక్కువై కుప్పకూలినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులు సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు 80 మంది గాయపడినట్లు చైనాని మున్సిపాలిటీ ఛైర్మన్ మాణిక్ గుప్తా తెలిపారు. వారిలో 20 నుంచి 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. వీటితో 6 నుంచి 7 మందిని జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఈ ప్రమాదంలో చిన్నారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలను చేపడుతుంది. ఈ ప్రమాదంతో భక్తుల సందడితో జరగాల్సిన వేడకలు విషాదంతో మిగిశాయి. ఈ ప్రమాదంపై పలువురు కేంద్రమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. పలువురు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయకచర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రికి సందర్శించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ రికార్డు అయ్యాయి. ఈ విజువల్స్ లో పరిశీలిస్తే ఒక్కసారిగా వంతెన కుప్పకూలిపోయినట్లు తెలుస్తుంది.