Site icon HashtagU Telugu

BRS NRIs: ఎమ్మెల్సీ కవిత తో బీఆరెస్ ఎన్నారైల బృందం భేటీ

Mlc Kavitha

Mlc Kavitha

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని బీఆరెస్ ఎన్నారైల బృందం అన్నారు. మహేష్ బిగాలా సమక్షంలో ఈరోజు వివిధ దేశాల ఎన్నారైలు అమెరికా నుంచి మహేష్ తన్నీరు (బీఆరెస్ USA అడ్విసోరీ చైర్) , చందు తల్లా (బీఆరెస్ USA కన్వీనర్), హరీష్ రెడ్డి & సురేష్ ఎమ్మెల్సీ కవిత ని కలిసి అభినందించారు అలాగే వివిధ అంశాలపై వారు చర్చించారు. ఎన్నారైలు మాట్లాడుతూ మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని పోరాటం చేశారని, దాని ఫలితంగానే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారని , ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు.

మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం ఓబీసీలకు, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు చేపట్టాలి అని అదే పోరాట పటిమతో ముందుకు వెళ్లాలని అన్నారు , అలాగే రిజర్వేషన్లకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అని అన్నారు.

రాబోయే ఎన్నికలలో అమెరికాలో ఎన్నారైలందరు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా బీఆరెస్ చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలలోకి తీసుకెళ్తామని అలాగే ఎన్నారైల తరపున ఎన్నికల ప్రచార ప్రణాలికను సిద్ధం చేసారని అన్నారు. వివిధ దేశాల ఎన్నారైలు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారములో పాల్గొంటారని అలాగే సోషల్ మీడియా క్యాంపెయిగ్న్ అండ్ టెలీఫోనిక్ కాంపెయిన్ లతో ప్రజల్లోకి బీఆరెస్ పథకాలను తీసుకెళ్తామని అన్నారు.

Exit mobile version