Site icon HashtagU Telugu

Noida : పరీక్షలో ఫెయిల్ అయ్యాడాని 5వ తరగతి విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..!!

USA

USA

గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టీచర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడు. పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బ్రుంధాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అక్టోబర్ 7న బంబావాద్ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు పరీక్ష జరిగింది. కొంతమంది పిల్లలు ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులను టీచర్ చేతులపై రెండు కర్రాలతో కొట్టాడు. అయితే ఓ విద్యార్థి ఆ దెబ్బలు తట్టుకోలేకపోయాడు. అతను అప్పటికే అనారోగ్యంతో ఉన్నాడు. ఆ విద్యార్థి అస్వస్థతకు గురికావడంతో…ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ లో సమాచారం అందించారు. ఆసుపత్రికి తీసుకెళ్లడంతో…అక్కడి వైద్యులు ఢిల్లీకి ఆసుపత్రికి రెఫెర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.