Site icon HashtagU Telugu

Lift Mishap : స్కూల్ లిఫ్ట్ లో కాలు ఇరుక్కోని…టీచర్ మృతి..!!

Lift Act Bill

Lift

ముంబైలో ఘొరం జరిగింది. వెస్ట్ మలాడ్ లోని సెయింట్ మేరిస్ ఇంగ్లీస్ మీడియం స్కూల్లో లిఫ్ట్ కాలు ఇరుక్కోని టీచర్ ప్రాణాలు కోల్పోయింది. ఆరవ అంతస్తులో ఉన్న టీచర్…కిందికి వచ్చేందుకు లిఫ్ట్ దగ్గరకు వచ్చింది. ఒక కాలు లిఫ్ట్ లో పెట్టగానే డోర్ మూసుకుంది. ఒక కాలు లోపల…శరీరం బయట ఉండగానే లిఫ్ట్ కింది అంతస్తుకు వచ్చింది.

టీచర్ కేకలు వేయడంతో పాఠశాల సిబ్బంది, స్టూడెంట్స్ లిఫ్ట్ దగ్గరకు పరుగులు తీశారు. లిఫ్ట్ క్యాబిన్ నుంచి టీచర్ ను బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఉపాధ్యాయురాలు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలిని 26 ఏళ్ల జెనెల్లె ఫెర్నాండెజ్‌గా గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.