Site icon HashtagU Telugu

Elon Musk Controversy:ఉద్యోగినిపై మస్క్ లైంగిక వేధింపులు..ఇది రాజకీయ కుట్రేనన్న టెస్లా అధినేత..!

Elon Imresizer

Elon Imresizer

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మస్క్ కు చెందిన బిజినెస్ ఫ్లయిట్ లో అటెండెంట్ గా వ్యవహరిస్తూ…ఆయనకు సపర్యలు చేసే మహిళా ఉద్యోగి పట్ల…మస్క్ లైగింక వేధింపులకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఆ ఉద్యోగి మౌనంగా ఉండేందుకు 2018లో 2,50,000డాలర్లను స్పేస్ ఎక్స్ కంపెనీ చెల్లించినట్లు తాజా కథనం ఒకటి బయట చక్కర్లు కొడుతోంది.

స్పేస్ ఎక్స్ కార్పొరేట్ జెట్ ఫ్లయిట్ లో కాంట్రాక్టు విధానంలో ఆమె అటెండెంట్ గా పనిచేసేవారు. మొదట ఆమెను ఎయిర్ హోస్టెస్ గా తీసుకున్నారు. తర్వాత మస్క్ కు మసాజ్ చేసే పని అప్పగించినట్లు ఆమె తన స్నేహితురాలికి చెప్పిన విషయాన్ని ఓ పత్రిక ప్రచురించింది. ఆ పత్రిక ఏం రాసుకొచ్చిందంటే…2016లో ఓ రోజు ఫ్లయిట్ లో తన గదికి రావాలని మస్క్ అటెండెంట్ ను ఆదేశించారు. లోపలికి వెళ్లిన తర్వాత మస్క్ అర్థనగ్నంగా ఉండి…ఆమె అనుమతి లేకుండా కాలిపై చేయి వేసి ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశారన్నది ఆరోపణ.

ఈ ఇష్యూపై మస్క్ స్పందించారు. తనపై జరుగుతున్న దాడిని రాజకీయ దాడిగా చూడాలని వ్యాఖ్యానించారు. మంచి భవిష్యత్తు, స్వేచ్చగా మాట్లాడే హక్కు విషయంలో పోరాడకుండా నన్ను ఎవరూ అడ్డుకోలేరంటూ మస్క్ ప్రకటించారు.