Site icon HashtagU Telugu

Sniffer Dog : స్నిఫర్ డాగ్ కు గర్భం.. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

A Sniffer Dog On Duty Is Pregnant

A Sniffer Dog On Duty Is Pregnant

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన ఓ కాపలా శునకం గర్భం (Sniffer Dog) దాల్చింది. మూడు పిల్లలకు జన్మనివ్వడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అత్యంత రక్షణ వలయంలో ఉండే శునకం కదలికలపై నిరంతరం నిఘా ఉంటుంది. కీలకమైన విధుల్లో ఉన్న శునకాల పెంపకంలో ఆర్మీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వాటికిచ్చే ఆహారం మొదలుకొని క్రమం తప్పకుండా వేసే టీకాల వరకు అంతా వాటి పర్యవేక్షకుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది.

మేఘాలయాలోని బంగ్లాదేశ్ సరిహద్దులో విధుల్లో ఉన్న శునకం లాల్సీ ఈ నెల 5న మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. 43వ బెటాలియన్ కు చెందిన ఈ స్నిఫర్ డాగ్ (Sniffer Dog) ఏ పరిస్థితుల్లో గర్భందాల్చిందో దర్యాఫ్తు చేపట్టాలని బీఎస్ఎఫ్ షిల్లాంగ్ విభాగం డిప్యూటీ ఆఫీస్ కమాండెంట్ అజీత్ సింగ్ ఆదేశించారు.

ఆర్మీ నిబంధనల ప్రకారం.. బీఎస్ఎఫ్ క్యాంప్, బార్డర్ పెట్రోలింగ్ సహా సరిహద్దుల దగ్గర విధుల్లో నియమించిన శునకాలను నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు వెళ్లేందుకు అధికారులు అనుమతించరు. ఆయా ప్రదేశాల్లో పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది. బయటి నుంచి ఎలాంటి జంతువులు లోనికి అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో స్నిఫర్ డాగ్ (Sniffer Dog) లాల్సీ గర్భం ఎలా దాల్చిందని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  TSPSC Notifications : TSPSC కి మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల