Site icon HashtagU Telugu

IPS Officer: రెస్టారెంట్‌లో ఐపీఎస్ ఆఫీసర్‌కు షాకింగ్ ఘటన.. ఒక దోశ తింటే రెండు దోశలకు బిల్లు?

Whatsapp Image 2023 05 09 At 20.35.58

Whatsapp Image 2023 05 09 At 20.35.58

IPS Officer: టిఫిన్ చేద్దామని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఐపీఎస్ అధికారికి షాక్ తగలింది. ఆయనకు ఓ వ్యక్తి టోకరా వేశారు. దీంతో ఆయన తిన్న టిఫిన్ కే కాకుండా మరో వ్యక్తి టిఫిన్‌కు కూడా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. రెస్టారెంట్ లో జరిగిన ఈ అరుదైన సంఘటనతో ఐపీఎస్ అధికారి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశాడు. ఒడిశాలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒడిశాకు చెందిన అరుణ్ బొత్రా అనే ఐపీఎస్ అధికారి రెస్టారెంట్‌కు వెళ్లి దోశ తిన్నాడు. అయితే ఆయనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి కూడా దోశ తినేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయాడు. దీంతో అతడి దోశ బిల్లును కూడా ఐపీఎస్ అధికారి బిల్లులో వేశారు. ఐపీఎల్ అధికారి ఒక దోశ తింటే బిల్లులో రెండు దోశలకు బిల్లు వేశారు. దీంతో ఐపీఎస్ అధికారికి అనుమానం వచ్చి హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. తాను ఒక దోశ తింటే రెండు దోశకు బిల్లు ఎందుకు వేశారని ప్రశ్నించాడు. దీంతో రెస్టారెంట్ యజమాని వింత సమాధానం ఇచ్చాడు.

మీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి దోశ తినేసి బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లిపోయాడని, అతడు మీకు తెలిసిన వ్యక్తి అయి ఉంటాడని అనుకున్నామని హోటల్ సిబ్బంది చెప్పాడు. దీంతో అతడు ఎవరో తనకు తెలియదని, తనకు తెలిసిన వ్యక్తి కాదని ఐపీఎస్ అధికారి చెప్పారు. అతడితో కలిసి తాను రాలేదని క్లారిీ ఇచ్చారు. అయినా కూడా హోటల్ సిబ్బంది ఐపీఎస్ అధికారి దగ్గరే అతడి బిల్లును కూడా వసూలు చేశారు. ఐపీఎల్ అధికారి ఎదురుగా కూర్చున్న వ్యక్తి మసాలా దోశ తినేసి వెళ్లిపోవడంతో అతడి బిల్లు కూడా చెల్లించాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి ట్విట్టర్ లో పంచుకోవడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐపీఎస్ అధికారిని మోసం చేసినట్లు అతడికి తెలిస్తే ఆశ్చర్యపోతాడని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరోసారి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మిమ్మల్ని పిలవండి.. నిందితుడిపై కన్నేసి ఉంచుతాం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.