Price Hike : మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్

త్వరలోనే చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది.

Published By: HashtagU Telugu Desk
A shock to the drug addicts..government will increase the rates by 20%?

A shock to the drug addicts..government will increase the rates by 20%?

Price Hike : మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్ తగలనుంది. బీర్ల సరఫరా కంపెనీల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం 15 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లైట్, స్ట్రాంగ్ బీర్ల ధరలు అమాంతం పెరిగాయి. సుమారు రూ.20 నుంచి 30 మేర ధరలు పెరిగడంతో మందు బాబులు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. ఇటీవల పెంచిన బీర్ల ధరల కారణంగా ఎక్సైజ్ శాఖకు రూ.700 కోట్ల మేర ఆదాయం సమకూరనుందని టాక్.

Read Also: TPCC : ఈనెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం..!

ఇక, పొరుగు రాష్ట్రాల్లో చీప్‌ లిక్కర్‌ మీద ధరల నియంత్రణ ఉంది. అక్కడి ప్రభుత్వాలు చీప్‌ లిక్కర్‌ మీద ఎక్సైజ్‌డ్యూటీ, వ్యాట్‌ పన్నులు తగ్గించుకొని తక్కువ ధరలకే అమ్ముతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం 90 ఎంఎల్‌ టెట్రాప్యాక్‌ చీప్‌ లిక్కర్‌ను రూ.45కు అందిస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం దేశీదారు పేరుతో క్వార్టర్‌ సీసాను రూ.35కే అందుబాటులోకి తెచ్చింది.

మరోవైపు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు క్వార్టర్‌ చీప్‌ లిక్కర్‌ను రూ.99కి విక్రయిస్తున్నది. పొరుగు రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణలో కూడా చీప్‌ లిక్కర్‌పై ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని సవరించి ధరలు తగ్గించాలని మద్యం ప్రియులు డిమాండ్‌ చేస్తున్నారు. అలా చేయడం ద్వారా రాష్ట్రంలో గుడుంబా ఉత్పత్తి, విక్రయాలు, ఎన్డీపీఎల్‌ కేసులు కూడా తగ్గుతాయని ఎక్సైజ్‌ అధికారులు చెప్తున్నారు.

Read Also: Cabinet Meeting: మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త చెప్ప‌నున్న ఢిల్లీ ప్ర‌భుత్వం!

 

 

  Last Updated: 20 Feb 2025, 02:13 PM IST