Site icon HashtagU Telugu

Rishi Sunak : రిషి సునాక్ కు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎదురుదెబ్బ..?

A setback for Rishi Sunak..?

Rushi

బ్రిటన్ ప్రధాన మంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ (Rishi Sunak) కు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం.. గత ఏడాది అక్టోబరులో అప్పటి ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ (Liz Truss) రాజీనామా చేయడంతో రిషి ఆ పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రిషితో పాటు ఉప ప్రధాన మంత్రి డొమినిక్ రాబ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి స్టీవ్ బార్‌క్లే, మరికొందరు ప్రముఖులు గెలిచే అవకాశం లేదని వెల్లడైంది. ఈ పోల్ ఫలితాలను బ్రిటిష్ వార్తా పత్రికలు ప్రచురించాయి. బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు 2025 జనవరి 25నాటికి పూర్తి కావాలి. ఫోకల్‌ డేటా (Focaldata) నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాల ప్రకారం, రిషి సునాక్ (Rishi Sunak), డొమినిక్ రాబ్, స్టీవ్ బార్‌క్లే, ఫారిన్ సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీ, డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలేస్, బిజినెస్ సెక్రటరీ గ్రాంట్ షాప్స్, కామన్స్ లీడర్ పెన్నీ మోర్డాంట్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ థెరెసా కొఫ్ఫీ తమ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది.

Also Read:  Twitter User Interface : రూపు మార్చుకుంటున్న ట్విట్టర్..