గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రౌడీ షీటర్ రాజు కంటి చూపు లేని ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. సదరు బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీన్ని మనసులో పెట్టుకున్న రాజు గంజాయి మత్తులో బాలిక ఇంటికొచ్చి దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తుంది. ఇక యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్పందించిన చంద్రబాబు
‘‘తాడేపల్లిలో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో బాలిక హత్య షాక్ కు గురిచేసింది. కంటి చూపులేని బాలికను వేధించడమే కాకుండా…దారుణంగా హతమార్చడం దిగ్భాంతిని కలిగించింది. సీఎం నివాస ప్రాంతంలో రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ల స్వైర విహారం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దుస్థితికి నిదర్శనం’’ అని చంద్రబాబునాయుడు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.