తెలంగాణలో చాలా దట్టమైన అడవులు ఉన్నాయి. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ లాంటి ప్రాంతాలు దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఇవన్నీ వివిధ రకాల పక్షులు, వణ్య ప్రాణులకు నిలయంగా మారుతోంది. తాజాగా ఓ అరుదైన జింక వెలుగులోకి వచ్చింది. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన మొరిగే జింక (బార్కింగ్ డీర్) కనిపించింది. అడవుల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇది చిక్కింది. బార్కింగ్ డీర్‌నే ఇండియన్ మంట్‌జాక్ అని కూడా పిలుస్తారు. తోటి జంతువులు ప్రమాదంలో పడినప్పుడు ఇది కుక్కలా మొరిగి వాటిని హెచ్చరిస్తుంది. అందుకనే దీనిని మొరిగే జింక అని పిలుస్తారు.
Rare Deer: తెలంగాణలో బార్కింగ్ డీర్

Barging Deer