Naga Chaitanya: అడ్డంగా బుక్కైన నాగచైతన్య..ఆమెతో లండన్ హోటల్లో అలా…!

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 06:29 AM IST

ఇప్పుడు సోషల్ మీడియా హీరో నాగచైతన్య (Naga Chaitanya) జపం చేస్తోంది. ఏ చిన్న క్లూ దొరికినా సరే నానా రచ్చ చేస్తోంది. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య ఆమెతో విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చాడు. అప్పటినుంచి వీరిద్దరూ ఎవరి లైఫ్ లో వారు బిజీగా మారిపోయారు. వీరిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు ట్రెండ్ అవతూనే ఉన్నాయి. సమంత, నాగచైతన్యకు సంబంధించిన పుకార్ల గురించి లెక్కే లేదు. ప్రస్తుతం వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ ప్రొఫెషనల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ ఫొటోలు చైతన్యతోపాటు శోభిత దూళిపాళ్ల కూడా ఉంది.

సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్లు ఆ మధ్య ఎన్నో వార్తలు వచ్చాయి. ఇద్దరూ సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నారని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్న టాక్ జోరుగా వినిపించింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని…వెకేషన్స్ కు వెళ్తున్నారన్న టాక్ నడిచింది. చైతు కొత్తగా ఇల్లు కొన్నాడని..శోభితను వివాహనం చేసుకోవాలని ఫిక్ అయినట్లు కూడా వార్తలు నడిచాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా బయటకు వచ్చిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. పెద్ద ఇష్యూనే చేసింది. చైతు శోభిత కలిసి లండన్ లో ఓ హోటల్లో డిన్నర్ డేట్ కు వెళ్లినట్లు ఈ ఫోటో స్పష్టం చేస్తోంది.ఈ ఫొటోనే వీరిద్దరూ బయటపెట్టలేదు. ఊహించని విధంగా హోటల్ సిబ్బంది ఒకరు షేర్ చేయడంతో అసలు మ్యాటర్ కాస్త లీక్ అయ్యింది. నాగచైతన్యతో అక్కడి హోటల్ చెఫ్ సురేందర్ మోహన్ ఫొటో దిగారు. వెనక శోభిత కూడా ఉంది. కావాలని కాకపోయినా అనుకోకుండా ఈ ఫొటోలు ఆమెకూడా పడింది. ఈ పిక్ సురేందర్ మోహన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది.