Pet Dog: యజమాని మృతి చెందినా ఆస్పత్రి వద్దే పెంపుడు శునకం ఎదురుచూపు!

సేలంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన యజమాని పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించి మూడు నెలలుగా పెంపుడు శునకం

సేలంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన యజమాని పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించి మూడు నెలలుగా పెంపుడు శునకం (Pet Dog) నిరీక్షిస్తున్న ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. తమిళనాడులోని సేలంలో ఉన్న మోహన్‌ కుమార మంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలల క్రితం ఓ వ్యక్తి గుండెపోటు కారణంగా చికిత్స కోసం చేరారు. ఆయన పెంపుడు శునకం (Pet Dog) కూడా అక్కడికి వచ్చింది. రోగి చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. యజమాని లోపలే ఉన్నారని భావించిన శునకం మూడు నెలలుగా ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. విధుల్లో ఉన్న సిబ్బంది అక్కడి నుంచి పంపేసినా మళ్లీ వస్తోంది. దీంతో ఆసుపత్రి సిబ్బందే ఆహారం అందిస్తున్నారు.

Also Read:  Sri Rama Navami: రూ.116 చెల్లిస్తే చాలు.. మన ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు అందుకోవచ్చు