World Record: ఈ మధ్యకాలంలో చాలా మంది బైక్ స్టంట్లు చేసి ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా కొంత మంది బైక్ స్టంట్ల ద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పుతున్నారు. సాధారణంగా బైక్ పై కూర్చోని చాలా దూరం ప్రయాణం చేస్తే బ్యాక్ పెయిన్ రావచ్చు. అందులోనూ ఎవరైనా బైక్ పై నిలబడి నడిపిన ఘటనలు ఉన్నాయా? అలాంటివి ఇప్పటి వరకూ జరగలేదనే చెప్పాలి. అయితే తాజాగా ఓ వ్యక్తి బైక్ పై నిలబడి ఏకధాటిగా 59 కిలోమీటర్లు నడిపాడు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సుకు చెందిన ఓ బైక్ స్టంటర్ ఇలా నిలబడి 59 కిలోమీటర్లు బైక్ నడిపాడు. అలా చేయడం వల్ల అతను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ బైక్ పై నిలబడి ఆ వ్యక్తి సోమవారం వరల్డ్ రికార్డు సాధించాడు. ఆ వ్యక్తి 59.1 కిలో మీటర్ వరకూ ఒక గంట 40 నిమిషాల 60 సెకన్లలో చేరుకోగలిగాడు.
ఆగ్రా, లక్నో మార్గంలో ఈ పోటీలు జరగ్గా అందులో బీఎఫ్ఎస్ ఇండియాకు చెందిన జాంబాజ్ టీమ్ సభ్యుడు అయిన సీటీ ప్రసన్నజీత్ నారాయణ్ దేవ్ అనే స్టంట్ మాస్టర్ బైక్ పై నిలబడి 59 కిలోమీటర్లు బైక్ ను నడిపి రికార్డు నెలకొల్పాడు. గతంలో కూడా ఇలాంటి స్టంట్లు చేసినప్పటికీ ఇలాంటి రికార్డు నమోదు చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అతడు సాధించిన ఈ ఘనతకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.