Windows Seat: విండో సీట్ కోసం ఆశపడిన వ్యక్తి.. చివరకు ఇంత మోసమా?

ప్రయాణం చేసేటప్పుడు విండో సీటు ప్రత్యేకతే వేరు. ఆ సీటు కోసం ప్రత్యేకంగా బుకింగ్ చేసుకోవడం, ముందే రిజర్వ్ చేసుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాము.

  • Written By:
  • Updated On - February 7, 2023 / 09:20 PM IST

Windows Seat: ప్రయాణం చేసేటప్పుడు విండో సీటు ప్రత్యేకతే వేరు. ఆ సీటు కోసం ప్రత్యేకంగా బుకింగ్ చేసుకోవడం, ముందే రిజర్వ్ చేసుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ప్రయాణంలో కిటికీలోంచి చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఆ మజా వర్ణనాతీతం. అందుకోసమే ఆ సీటుకున్న ప్రత్యేకత అలాంటింది. ఇక బస్సులో, ట్రైన్లలో మాత్రమే కాకుండా విమానంలోని కిటికీ సీటు కు కూడా భారీ డిమాండ్ ఉంటుంది. దానికోసం బుకింగ్ టైమ్ లో ప్రత్యేకంగా వెతుకుతూ ఉంటారు ప్రయాణికులు. అలా ఆశపడిన ఓ వ్యక్తికి నిరాశ ఎదురైంది.

విమానంలో ప్రయాణం కోసం విండో సీట్ బుకింగ్ చేసుకున్న ఒక వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. సాధారణ టికెట్‌ ధరకంటే ఎక్కువ చెల్లించి విండో సీట్‌ కొనుక్కున్నప్పటికీ అతనికి ప్రయోజనం లేకపోయింది. తాను తీరా విమానం ఎక్కిన తర్వాత అక్కడ అసలు కిటికీ నే లేదు. మొత్తం కవర్ చేసి మూసి ఉంది. దీంతో ఆశ్చర్యానికి లోనైన ఆ ప్రయాణికుడు సదరు ఫొటోను తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుని, తన బాధను మిత్రులతో షేర్ చేసుకున్నాడు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

అసలు విషయానికొస్.. అనిరుద్‌ మిత్తల్‌ అనే ప్రయాణికుడు లండన్‌ వెళ్లేందుకు బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అందరిలాగే విమానం కిటికి సీటు ఇష్టపడ్డ ఆ ప్రయాణికుడు.. విండో సీట్ బుక్ చేసుకున్నాడు. ల్యాండింగ్‌ సమయంలో సైడ్ నుండి చూసే సీనరీస్ బాగుంటాయని విమానం కుడివైపు విండో సీట్‌ను బుక్‌ చేసుకున్నాడు. ఇక ఆనందంగా జర్నీ ఎంజాయ్ చేద్దామని విమానం ఎక్కినా సదరు ప్రయాణికుడు.. అక్కడ విండో లేకపోయేసరికి ఆశ్చర్యపోయాడు. అయన సీటుకు వెనుకవైపు, ముందువైపు రెండు సీట్లకూ విండో సదుపాయం ఉంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు అక్కడున్న సిబ్బందిని అడగగా.. అక్కడ కిటికీ లేదని వారు సమాధానం ఇచ్చారు.

ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి “విండో సీట్‌ కోసం టికెట్‌ ధర కంటే ఎక్కువగానే చెల్లించా. కానీ ప్రయోజనం లేకపోయింది” అంటూ పోస్ట్ చేసాడు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీరు “విండోస్‌” యూజర్‌ అని వాళ్లకు తెలియకపోయి ఉంటుంది. అందుకే మీకు విండో సీట్‌ కేటాయించలేదు అని ఒక యూసర్ చమత్కరించగా.. అప్పట్లో నాక్కుడా ఇలా జరిగింది అని మరో యూసర్ థన్ గోడును వెళ్లబోసుకున్నాడు.