Site icon HashtagU Telugu

Flight Passenger: విమానం టేకాఫ్ అవుతుండగా తలుపు తెరిచే ప్రయత్నం చేసిన ప్రయాణికుడు.. చివరికి?

Refund Rules

Refund Rules

విమానంలో ప్రయాణించే కొందరు ప్రయాణికుల వల్ల విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని కొన్ని సార్లు వారి ప్రాణాలతో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలతో కూడా కొంతమంది చలగాటమాడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి పనే ఒక ప్రయాణికుడు చేశాడు. వెంటనే సిబ్బంది తోటి ప్రయాణికులు స్పందించి అతన్ని అడ్డుకోవడంతో ఆ పెద్ద ప్రమాదం తప్పింది.

అసలేం జరిగిందంటే.. క్రొయేషియాలోని జాదర్‌ నుంచి లండన్‌కు వెళ్లే ర్యాన్‌ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాగ్ ద్వీపంలో జరిగిన హైడ్‌ అవుట్ క్రొయేషియా మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొని చాలా మంది ప్రయాణికులు లండన్‌కి తిరిగి ప్రయాణం అయ్యారు. ఈ సమయంలో యూకేకి చెందిన 27 ఏళ్ల యువకుడు తోటి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు. విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో సిబ్బందితో తలుపు తెరవాలని గట్టిగా అరిచాడు. సిబ్బంది ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు.

 

అంతేకాకుండా ఇతర ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడున్న మహిళా సిబ్బందిని దాటుకుని మరి తలుపు తెరిచే ప్రయత్నం చేయబోయాడు. ఇంతలో ఇద్దరు ప్రయాణికులు అతడిని అడ్డుకుని కింద పడేసి దాడి చేశారు. సిబ్బంది ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఆ ప్రయాణికుడిని కఠినంగా శిక్షించాలని బుద్ధి చెప్పాలని కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version