Jagityala: జగిత్యాలలో నవజాత శిశువు.. కాళ్లకు, చేతులకు 24 వేళ్ళు?

మామూలుగా కొన్ని కొన్ని చోట్ల అరుదైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక అప్పుడప్పుడు నవజాత శిశువులు జన్మించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఆ శిశువులు రకరకాల రూపాలతో పోలి ఉంటారు.

  • Written By:
  • Publish Date - April 17, 2023 / 06:56 PM IST

Jagityala: మామూలుగా కొన్ని కొన్ని చోట్ల అరుదైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక అప్పుడప్పుడు నవజాత శిశువులు జన్మించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఆ శిశువులు రకరకాల రూపాలతో పోలి ఉంటారు. ఇప్పటికే పలుచోట్ల కొన్ని కొన్ని రూపాలతో ఉన్న శిశువులు కూడా జన్మించారు. అయితే తాజాగా మరో నవజాతి శిశువు జన్మించగా ఆ శిశువుకు మొత్తం 24 వేళ్లు రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసాయి.

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం ఎర్రగట్లకు చెందిన సుంగారావు రవళి అనే ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే సమీపంలో ఉన్న మెట్ పల్లి ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వెంటనే జగిత్యాల కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇక అక్కడ రవళి బిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు కాళ్లు చేతులు చూసి అక్కడి వైద్యులు ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే ఆ శిశువుకు ఒక్కో చేయి, కాళ్లకు ఆరు చొప్పున మొత్తం 24 వేళ్లు ఉన్నాయి. ఇక వైద్యులు తల్లి బిడ్డల పరిస్థితి నిలకడగా ఉంది అని ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని తెలిపారు.

అయితే వైద్య పరిభాషలో అలా పుట్టిన శిశువుకు పాలీడాక్టిలీ కండిషన్ అని తెలిపారు వైద్యులు. అయితే ఆ కండిషన్ తో జన్మించిన శిశువులకు గుండెలో రంద్రం ఉండే అవకాశం ఉందని తెలుపగా.. ఈ శిశువుకు అటువంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. దీంతో ఆ శిశువుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇటువంటి ఘటనలు కొన్ని కొన్ని చోట్ల పోషకాహారం లోపాల వల్ల కూడా జరుగుతుంటాయని వైద్యులు తెలుపుతున్నారు.