Site icon HashtagU Telugu

Cyber Attack: సైబరాబాద్ లో వెలుగులోకి కొత్త రకం సైబర్ అటాక్..!!

Cyber Crime

Cyber Crime

దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజల్లో సైబర్ మోసాలపై చైతన్యం తీసుకువచ్చేందు ఎంత ప్రయత్నించినా…రోజుకో కొత్త పంథాలో సైబర్ మోసాలకు తెగపడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో కొత్తరకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీ చేజిక్కించుకునేందుకు సైబర్ దాడులు చేశారు ఉద్యోగులు. ప్రముఖ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థపై సైబర్ దాడులు జరిపిన కేటుగాళ్లు…కంపెనీకి సంబంధించిన రహస్య డేటా చేజిక్కించుకున్నారు.

కంపెనీలోని ఉద్యోగులే గత కొన్నేళ్లుగా సైబర్ అటాక్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈఘటనపై హాంగర్ టెక్నాలజీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు సైబర్ క్రైం పోలీసులు. కంపెనీకి సంబంధించిన అందాగ్ విజయ్ కుమార్, కరణ్‌కుమార్, అశ్వంత్‌కుమార్‌తో పాటు ఇద్దరు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రివ్వాల్వర్‌తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అమెరికాలో ఉన్నా మరో నిందితుడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.