Medak: షాకింగ్.. అతిగా నిద్రిస్తున్నారనే కారణంతో పిల్లలపై వేడినీళ్లు పోసిన తల్లి

పిల్లలు బాగా నిద్రపోతున్నారనే కారణంతో ఓ తల్లి వేడినీళ్లు పోయడంతో వారు తీవ్ర గాయాలయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Woman crime

Woman crime

Medak: అతిగా నిద్రిస్తున్నారని ఇద్దరు పిల్లలపై ఓ తల్లి వేడినీళ్లు పోయడంతో  తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అల్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రితిక (9), శ్రీనిత్య (6)లకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తల్లి సంతోషి తన కుమార్తెలు ఉదయం ఆలస్యంగా నిద్రిస్తున్నారని, పాఠశాలకు ఆలస్యంగా వెళ్తున్నారని గమనించింది. పదే పదే హెచ్చరించినా ఫలితం లేకపోయింది, సంతోషి విసుగు చెంది కోపంతో వారిపై వేడి నీటిని పోసింది.

పిల్లలు కేకలు వేస్తూ లేచారు, కాలిన గాయాలతో వారు నొప్పిని తట్టుకోలేకపోయారు. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోగా చిన్నారులు నొప్పితో బోరున ఏడ్వడం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారులను కాలిన గాయాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంతోషిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలకు సమయానికి నిద్ర లేవకపోవడంతో కూతుళ్లపై మనస్తాపం చెందిందని విచారణలో తెలిపింది. తదుపరి విచారణ నిమిత్తం తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: BRS Tickets: మహిళలకు కేసీఆర్ మొండిచేయి, కేవలం ఏడుగురికే ఛాన్స్!

  Last Updated: 22 Aug 2023, 01:44 PM IST